కొంచెం బొద్దుగా, ముద్దుగా కనిపించే రాశీఖన్నా స్లిమ్‌గా మారిపోయింది. చూస్తున్నారుగా, ఈ పిక్‌లో ఉన్నది అసలు రాశీఖన్నానేనా? అనిపించేంతలా బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్‌లో స్లిమ్ అండ్ స్లీకీగా ఎట్రాక్ట్ చేస్తోంది. ఏమాటకామాటే చెప్పాలి, బొద్దుగా ఉన్నా, స్లిమ్‌గా ఉన్నా, స్టైలింగ్ మాత్రం మిస్ కాదు రాశీఖన్నా. ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీగా గడుపుతోంది రాశీఖన్నా. తెలుగులో సాయి ధరమ్ తేజ్ సరసన 'ప్రతీరోజూ పండగే' సినిమాలో నటిస్తోంది.
తమిళంలోనూ కొన్ని ప్రాజెక్టుల్లో నటిస్తోంది. లేటెస్ట్గా బాలీవుడ్‌నీ టచ్ చేసింది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తుంటుంది. అలా లేటెస్ట్గా పోస్ట్ చేసిన రాశీఖన్నా పిక్ ఫ్యాన్స్‌కి కిర్రాక్ తెప్పిస్తోంది. అల్రా మోడ్రన్ వేర్లో ఓ ఛైర్లో డిఫరెంట్ పోజులో కూర్చొని లేడీ బాస్ బిల్డప్ ఇచ్చింది. ఈ బిల్డప్ లుక్స్‌కి మీరిచ్చే మార్కులెన్నో కాస్త చెబుతారా.? ప్లీజ్.!