అదేంటండీ..ఊ ఇంకా ఈయన డెబ్యూనే చూడలేదు. అప్పుడే ఎక్కువ, తక్కువలు ఎలా బేరీజు వేసేస్తాం అనుకుంటున్నారా.? మీరు అనుకునేది మహేష్ పెద్ద మేనల్లుడు గల్లా అశోక్ గురించి. మేం చెప్పేది.. గల్లా సిద్దార్ధ్. ఈయన చిన్న మేనల్లుడు. అబ్బో.. ఇంకో మేనల్లుడున్నాడా.? అనుకుంటున్నారా.? అవునండీ ఉన్నాడు మరి. ఈయన కూడా హీరోగా తెరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు కూడా. అన్నయ్య కన్నా ముందే ఎంట్రీ ఇచ్చేసేలా ఉన్నోడు మనోడి స్పీడు చూస్తే.
నేను హీరోగా త్వరలో మీ ముందుకు వస్తున్నా.. అంటూ తనకు తానే పరిచయం చేసేసుకున్నాడు తెలుసా.? ఘటికుడే ఈ ఘట్టమనేని అల్లుడు. అయితే, పెద్దోడ్ని జాగ్రత్తగా దగ్గరుండి తండ్రి గల్లా జయదేవ్ సొంత బ్యానర్ ద్వారా పరిచయం చేస్తున్నాడు. కానీ, మనోడు మాత్రం ఓ అగ్ర నిర్మాణ సంస్థ ద్వారా డెబ్యూ ఇవ్వబోతున్నాడట.
ఆ అగ్ర నిర్మాణ సంస్థ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్సే. కానీ, కుర్రోడు మాత్రం భలే చాకులాంటోడు లెండి. అందుకే చాకులాంటి లవ్ స్టోరీతో వచ్చి, యూత్‌లో క్రేజ్ కొట్టేస్తానంటూ నమ్మకంగా చెప్పేస్తున్నాడు. కొంచెం ఎక్కువే అయినా, ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న కాంపిటేషన్‌కి హీరోగా నిలదొక్కుకోవాలంటే, ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలిలెండి. ఈ రోజు గల్లా అశోక్ సినిమా లాంచింగ్ గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే గల్లా సిద్దార్ద్ ముచ్చట కూడా బయటికొచ్చింది. భలేగుందిలే.. గల్లా కుమారుల డబుల్ ధమాకా.. డబుల్ డబుల్ డబుల్ కా మీటా.!