సుకుమార్ డైరెక్షన్‌లో చరణ్ సినిమా చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా రాశి ఖన్నా పేరు బాగా వినిపించింది. అందుకోసం ఈ ముద్దుగుమ్మ ఏకంగా ఒళ్లు తగ్గించడానికి వర్కవుట్స్ కూడా మొదలెట్టేసిందంటూ గాసిప్స్ వచ్చేశాయి. అయితే ఆ తర్వాత రాఖీఖన్నాకి ఈ అవకాశం రాలేదట. ఇది ఉత్త గాసిప్ మాత్రమే అంటూ కూడా న్యూస్ వచ్చేసింది. అయితే హీరోయిన్‌గా ఆ ఛాన్స్ దాదాపు ఖాయమైపోయిందట ఇప్పుడు రాశీఖన్నాకి. ఈ సినిమా కోసం రాశి ఖన్నా పడిన కష్టం ఫలించిందన్న మాట. ఈ ముద్దుగుమ్మ నిజంగానే చాలా కష్టపడిందట. అయితే ఛాన్స్ చేజారిందని కొన్ని రోజుల క్రితం వచ్చిన గాసిప్స్ అన్నీ కేవలం కల్పితాలు మాత్రమేనని అంటున్నారు ఓ పక్క. అయితే ఇప్పుడు మళ్ళీ రాశికే ఆ ఛాన్స్ దక్కిందని కొందరు అంటున్నారు. మొత్తానికి ఈ బొద్దుగుమ్మ రాశి ఖన్నా, చాలా స్లిమ్ అయిపోయిందిప్పుడు. మొదట్నుంచీ కొంచెం బొద్దుగానే హీరోయిన్‌గా క్యూట్ క్యూట్‌గా ఎట్రాక్ట్ చేసేసింది రాశీఖన్నా. అయితే చరణ్ కోసమే తొలిసారి తన దేహాకృతి మీద దృష్టి పెట్టిందట. ఎంతైనా మెగా పవర్ స్టార్ కదా. అందులోనూ డాన్సుల్లో కూడా చరణ్ పక్కన బాగా తేలిపోతుంది రాశీఖన్నా. అందుకే దేహాకృతితో పాటు డాన్స్‌పై కూడా కాన్‌సన్‌ట్రేషన్ చేస్తోందట. స్పెషల్‌గా డాన్సు క్లాసులకు కూడా ఈ బబ్లీ బ్యూటీ అటెండ్ అవుతోందని సమాచారమ్.