గ్లామ్‌షాట్‌: బికినీలో అందాలారబోసిన రాశీఖన్నా.

By iQlikMovies - August 03, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

అందాల ఆరబోతలో తనదైన లిమిట్స్‌ ఫాలో చేసే ముద్దుగుమ్మ రాశీఖన్నా, తాజాగా బికినీ సొగసులతో రెచ్చిపోయింది. ఓ మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ కోసం ఇలా బికినీలో అందాలారబోసింది రాశీఖన్నా. అరె.. రాశీఖన్నాకి ఏమైంది.? అంటూ కొందరు ఈ పిక్స్‌ చూసి కామెంట్స్‌ చేస్తుంటే, రాశీలో ఈ యాంగిల్‌ సూపర్బ్‌ అంటూ ఇంకొందరు తెగ పొగిడేస్తున్నారు. బికినీలో అందాలు డైరెక్ట్‌గా చూపించకుండా, ఉల్లిపొర లాంటి డిజైనర్‌ క్లాత్‌తో కవర్‌ చేసి చూపిస్తూ, సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనిపిస్తోంది ఈ లేటెస్ట్‌ పిక్స్‌లో రాశీఖన్నా.

 

బికినీ సోయగాలే కాదు, సెక్సీ ఎక్స్‌ప్రెషన్స్‌తో పిచ్చెక్కించేస్తోంది కూడా. కళాపోషకులకు ఇంతకు మించిన పండగ ఏముంటుంది చెప్పండి. అన్నట్లు ఈ అందాల రాశీ 'ప్రతీరోజూ పండగే' సినిమాలో తేజుకి జోడీగా నటిస్తోంది. 'వెంకీ మామ'లో చైతన్యతో జత కడుతోంది. తమిళంలోనూ రాశీఖన్నా కెరీర్‌ దూకుడు మీదుంది. తాజాగా 'సంఘ తమిళన్‌' అనే మూవీలో రాశీ నటిస్తోంది. విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS