తెర మాటున దాగిన అందాల 'రాశి'

By iQlikMovies - August 02, 2018 - 16:01 PM IST

మరిన్ని వార్తలు

'తొలిప్రేమ' సినిమాతో హిట్‌ అందుకున్న ముద్దుగుమ్మ రాశీఖన్నా తర్వాత 'శ్రీనివాస కళ్యాణం'లో నితిన్‌కి జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాశీ ఖన్నాది ట్రెడిషనల్‌ క్యారెక్టర్‌ కావడంతో, సినిమా ప్రమోషన్స్‌కి అదే గెటప్‌లో కనిపిస్తోంది. 

పదహారణాల తెలుగుదనంతో నిండుగా పట్టు చీరల్లో కనిపించి సందడి చేసింది. అయితే సడెన్‌గా తనలోని గ్లామర్‌ క్వీన్‌ని నిద్ర లేపినట్లయ్యింది తాజా పిక్‌తో. హైద్రాబాద్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌ కోసం రాశీఖన్నా ఈ దుస్తుల్లో దర్శనమిచ్చింది. టాప్‌ టు బాటమ్‌ నెట్‌ పేట్రన్‌తో డిజైన్‌ చేసిన ఈ కాస్ట్యూమ్‌లో రాశీఖన్నా అందాలు తెర మాటున దాగీ దాగనట్లుగా దర్శనమిచ్చేస్తున్నాయి. 

ఆ హాట్‌ హాట్‌ అంద చందాల్ని తిలకించేందుకు అభిమానులు క్యూ కట్టేశారు. ఈ పిక్‌లో రాశీ ఎక్స్‌పోజింగ్‌కి సోషల్‌ మీడియాలో నెటిజన్లు కాస్త నెగిటివ్‌గానే కామెంట్స్‌ పెడుతున్నారు. అయినా కానీ తనలోని ఈ న్యూ గ్లామర్‌ యాంగిల్‌ని ఇప్పుడింతలా ప్రదర్శనకు పెట్టే ఆలోచన ఎందుకు చేసిందో రాశీఖన్నా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS