అందాల భామ రాశీఖన్నా కి అన్నీ ఉన్నా, ఏదీ కలిసి రావడంలేదు. కొంతమంది ముద్దుగుమ్మలు సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా కెరీర్‌లో దూసుకెళ్లిపోతుంటే, రాశీఖన్నాలాంటి వారికి టైం కలిసి రావడం లేదు. సక్సెస్ వచ్చినా, క్రేజ్ ఉన్నా, అది ఎంతో కాలం నిలవడం లేదు. 'సుప్రీమ్' సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ తర్వాత ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేయడానికి చాలా కాలమే పట్టింది. ఎలాగోలా 'తొలిప్రేమ'తో బంపర్ హిట్ కొట్టింది. ఇక రాశీఖన్నాకి తిరుగే లేదనుకున్న తరుణంలో మళ్లీ 'శ్రీనివాస కళ్యాణం' రూపంలో నిరాశే ఎదురైంది.
అలా ఇప్పుడు తెలుగులో అమ్మడి చేతిలో పెద్దగా అవకాశాలు లేవు. కానీ తమిళంలో రాశీఖన్నా దూకుడు మీదే ఉంది. చేతిలో మూడు సినిమాలతో అక్కడ బిజీగా గడుపుతోంది. ఒకానొక టైంలో ముద్దుగుమ్మలు ఒక భాషలో అవకాశాలు రాకపోతే, ఫేమ్‌లో లేకుండా పోయేవారు. కానీ ఇప్పుడలా కాదు, వెంటనే ట్రాక్ ఛేంజ్ చేసేస్తున్నారు. ఈ భాష కాకపోతే, మరో భాష. వెంటనే షిఫ్ట్ అయిపోతున్నారు.
అక్కడా, ఇక్కడా అవకాశాలు దొరికితే డబుల్ ధమాకా, రెండు చోట్లా దున్నేసుకుంటున్నారు కాజల్, తమన్నా తదితర ముద్దుగుమ్మల్లా. లేదంటే ఇక్కడ కాస్త గ్యాపిచ్చి, అక్కడ చక్కబెట్టి మళ్లీ ఇక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాశీఖన్నా పరిస్థితి అలాగే ఉంది. తమిళంలో ఫుల్ బిజీగా గడుపుతోన్న ఈ బ్యూటీ తెలుగులో ఓ సూపర్ డూపర్ ఛాన్స్ కోసం వెయిటింగ్‌లో ఉంది.