ఫైటింగులు చేస్తానంటోంది!

By Gowthami - June 24, 2021 - 14:31 PM IST

మరిన్ని వార్తలు

క‌థానాయిక‌ల‌కు ఓ ఆశ త‌ప్ప‌కుండా ఉంటుంది. తాము కూడా హీరోల్లా ఫైటింగులు చేయాల‌ని, వాళ్ల‌లా థియేట‌ర్ల ముందు పెద్ద పెద్ద క‌టౌట్లు పెట్టించుకోవాల‌ని క‌ల‌లు కంటుంటారు. ఆ అదృష్టం కొంత‌మందికే రాసుంటుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ క‌థ‌లు వ‌స్తే.. త‌ప్ప ఈ క‌ల‌లు నెర‌వేర‌వు. ప్ర‌స్తుతానికి రాశీఖ‌న్నా కూడా అలాంటి క‌థ‌ల కోస‌మే ఎదురు చూస్తోంది. ఇది వ‌ర‌కు త‌న ద‌గ్గ‌ర‌కు ఇలాంటి క‌థ‌లొచ్చాయ‌ని, అయితే.. అప్ప‌ట్లో త‌న అనుభ‌వం స‌రిపోద‌నిపించి ప‌క్క‌కు పెట్టాన‌ని, ఇప్పుడు క‌థ‌నంతా న‌డిపించ‌గ‌ల సామ‌ర్థ్యం త‌న‌కొచ్చింద‌నిపిస్తోంద‌ని చెప్పుకొచ్చింది రాశీ.

 

``లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ల్లో మెప్పించ‌డం అంత సుల‌భం కాదు. నాక్కూడా సినిమా అంతా క‌నిపించాల‌ని, ఫైటింగులు చేయాల‌ని వుంది. కానీ.. అంత శ‌క్తిమంత‌మైన క‌థ‌లు రావాలి. ప్ర‌స్తుతానికైతే నేను అలాంటి క‌థ‌ల కోసం ఎదురు చూస్తున్నా`` అని మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS