ఇది ప‌సందైన పోటీ

By iQlikMovies - June 24, 2021 - 13:27 PM IST

మరిన్ని వార్తలు

నువ్వా - నేనా..? అనే ధోర‌ణి హీరోల మ‌ధ్యే కాదు, హీరోయిన్ల మ‌ధ్య కూడా ఉంటుంది. ఒక్కో సీజ‌న్ లో ఒక్కో క‌థానాయిక‌ది హ‌వా. ఆ పోటీని త‌ట్టుకుని నిల‌దొక్కుకునే వాళ్లే రాణిస్తారు. త‌మ మ‌ధ్య పోటీ లేద‌ని చెప్పినా - ఈ రేసులో ఒక‌రిపై మ‌రొక‌ర‌రు పైచేయి సాధించాల‌ని చూస్తుంటారు. త‌మ‌న్నా కూడా చిత్ర‌సీమ‌లో క‌థానాయిక‌ల మ‌ధ్య పోటీ ఉంద‌నే అంటోంది.

 

అయితే...ఈ పోటీ ఆరోగ్య‌క‌రంగా ఉంటుంద‌ని, పోటీ ఉన్నంత మాత్రన క‌థానాయిక‌ల మ‌ధ్య స్నేహం లేకుండా పోద‌ని చెబుతోంది. ``పోటీ లేక‌పోతే ఎలా? ఇక్క‌డ ఎవ‌రిపై ఎవ‌రు గెలిచార‌న్న‌ది ముఖ్యం కాదు. ఎవ‌రి ప్ర‌తిభ ఎంత‌న్న‌దే కీల‌కం. ప్ర‌తీ ఒక్క‌రికీ ఓ రోజు వ‌స్తుంది. ఆరోజున వాళ్ల ప్ర‌తిభ‌ని, విజ‌యాన్ని గౌర‌వించాలి`` అని చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS