అదేంటీ.. రాశీ ఇంతవరకూ ఆ పని చేయలేదా?

మరిన్ని వార్తలు

అందాల భామ రాశీఖన్నా హీరోయిన్‌ మాత్రమే కాదు, అంతకు మించి మంచి గాయని అన్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా ప్రమోషన్స్‌లో క్యూట్‌ క్యూట్‌గా మాట్లాడేస్తూ, అవకాశం చిక్కితే పాటలు కూడా పాడేస్తుంటుంది. ప్లే బ్యాక్‌ సింగర్‌గా పలు చిత్రాల్లో ఇప్పటికే కొన్ని పాటలు కూడా ఆలపించింది అందాల రాశీ ఖన్నా. అరతేకాదు, తన పాత్రలకు డబ్బింగ్‌ తానే చెప్పుకుంటుందనుకుంటున్నారిప్పటి వరకూ అంతా. కానీ, రాశీఖన్నా ఇంతవరకూ డబ్బింగ్‌ చెప్పలేదట. తాజాగా ఆ ముచ్చట తీర్చుకుంటోంది. కానీ, మంచి మాటకారి, మంచి సింగర్‌ అయిన రాశీఖన్నా తొలి సారి డబ్బింగ్‌ చెప్పుకోవాలంటే చాలా టెన్షన్‌ ఫీలయ్యిందట. ఆ విషయాన్ని సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది. ఇంతకీ ఏ సినిమా కోసం రాశీఖన్నా డబ్బింగ్‌ చెప్పుకుందనుకుంటున్నారా? ఆమె నటిస్తున్న 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' సినిమా కోసం.

 

విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం తొలిసారి డబ్బింగ్‌ చెప్పుకుందట రాశీఖన్నా. అంతేకాదు, ప్రస్తుతం రాశీఖన్నా చేతిలో చాలా చాలా ప్రాజెక్టులున్నాయి. త్వరలోనే ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నెలలో 'విజయ్‌ సేతుపతి' అనే డబ్బింగ్‌ సినిమాతో రాశీఖన్నా ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. డిశంబర్‌లో సాయి ధరమ్‌ తేజ్‌తో 'ప్రతిరోజూ పండగే' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS