'ప్రతిరోజూ పండగే' టికెట్స్‌ అమ్మిన ఏంజల్‌ అరుణ.!

మరిన్ని వార్తలు

ఎవరీ 'ఏంజల్‌ అరుణ' అనుకుంటున్నారా.? ఇంకెవరండీ బాబూ మన అందాల భామ రాశీఖన్నా. 'ప్రతిరోజూ పండగే' సినిమాలో రాశీఖన్నా పాత్ర పేరు 'ఏంజెల్‌ అరుణ'. టిక్‌ టాక్‌ వీడియోస్‌ చేసే అమ్మాయిగా కనిపిస్తోంది. ట్రెడిషన్‌ వేర్‌లో పక్కా రాజమండ్రి అమ్మాయిగా ఆకట్టుకోనుంది రాశీఖన్నా ఈ సినిమాలో. నిజానికి మొదట్లో టిక్‌ టాక్‌ అంటే రాశీఖన్నాకి అస్సలు ఇష్టముండేది కాదట. కానీ, ఆ పాత్ర పోషించాకే దాని వేల్యూ ఏంటో అర్ధమైందంటోంది రాశీఖన్నా.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

@raashikhannaoffl Selling Movie Tickets 😅 #prathirojupandage @jetpanja @maruthi_official

A post shared by iQlik Movies (@iqlikmovies) on

ఈ టిక్‌టాక్‌ కారణంగా ఎంతో మంది స్టార్స్‌గా ఎదిగారు. చాలా మంది టిక్‌ టాక్‌ స్టార్స్‌కి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. అయితే, ఏదైనా పరిధి దాటనంత వరకే. లిమిట్స్‌లో వాడితే, ఏదైనా మంచిదే అని కితాబిస్తోంది. ఇకపోతే, 'ప్రతిరోజూ పండగే' సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తనదైన శైలిలో ప్రమోషన్స్‌ నిర్వహిస్తోంది రాశీఖన్నా. ఈ రోజు హైద్రాబాద్‌లోని ఎర్రగడ్డ గోకుల్‌ ధియేటర్‌లో టికెట్స్‌ అమ్ముతూ కనిపించి ఫ్యాన్స్‌లో జోష్‌ నింపింది రాశీఖన్నా. మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా మారుతి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. అన్నట్లు ఈ సినిమా కోసం రాశీఖన్నా ఓ పాట కూడా పాడింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS