ఈవారం మూడు సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాయి. రూలర్, ప్రతిరోజూ పండగే, దొంగ బాక్సాఫీసు ముందుకు రాబోతున్నాయి. మూడు సినిమాలూ ఒకే రోజంటే... సినీ ప్రేమికులకు పండగే. మూడూ మూడు జోనర్లలో రూపొందిన సినిమాలు కావడం విశేషం. అయితే ఈ మూడు చిత్రాలకూ ఒకటే ఇబ్బంది ఉందట. అదే.. సెకండాఫ్.. ఈ సినిమాల సెన్సార్ పూర్తయ్యాయి. సర్టిఫికెట్లు కూడా చేతికి అందేశాయి. ఇక థియేటర్లలో సందడి చేయడమే తరువాయి. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం మూడు సినిమాలకూ సెకండాఫ్ గండం ఉందట. ప్రధమార్థం బాగానే ఉన్నా.. ద్వితీయార్థం నెమ్మదిస్తోందని, మూడు సినిమాల్లోనూ సెకండాఫ్ సరిగా రాలేదని తెలుస్తోంది.
రూలర్ తొలి భాగంలో బాలయ్య హీరోయిజం బాగా పండిందని, ద్వితీయార్థంలో లాగ్ అయ్యిందని తెలుస్తోంది. ప్రతిరోజూ పండగలో ప్రధమార్థం వినోదాత్మకంగా సాగిందట. సెకండాఫ్ వేగం మందగించిందని, ఎమోషన్లు సరిగా వర్కవుట్ అవ్వలేదని తెలుస్తోంది. దొంగ ది కూడా సేమ్ ప్రాబ్లమ్. మరి ఇది ఎంత వరకూ నిజమో తెలియాలంటే శుక్రవారం వరకూ ఆగాల్సిందే.