అందాల భామ రాశీఖన్నా తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'ఇమైకా నడగళ్' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నయనతార కీలక పాత్ర పోషిస్తోంది. ఓ భయంకరమైన సైకోతో నయనతార చేసే పోరాటమే ఈ సినిమా కథ. అధర్వ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అధర్వకు లవర్‌గా రాశీఖన్నా నటిస్తోంది.
ఈ సినిమాలో రాశీఖన్నా పాత్రకు అంతగా స్కోప్ లేదనే చెప్పాలి. కానీ కాన్సెప్ట్ నచ్చడంతో ఈ సినిమాకి ఓకే చేసిందట రాశీఖన్నా. ట్రైలర్లో క్యూట్‌గా అందంగా కనిపిస్తోంది రాశీఖన్నా. ఇకపోతే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర నయనతారదే. మొదట్లో ఈ పాత్రకు ఓ ప్రముఖ నటున్ని అనుకున్నారట. అయితే నయనతార అయితే బావుంటుందని భావించి, ఆ పాత్రలోకి నయన్‌ని షిఫ్ట్ చేశారనీ తెలుస్తోంది.
అత్యంత జుగుప్సాకరంగా ట్రైలర్‌ని కట్ చేశారు. కాన్సెప్ట్ చాలా క్రిటికల్ కాన్సెప్ట్. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సైకో పాత్ర పోషించాడు. అత్యున్నత స్థాయి పోలీసాఫీసర్ పాత్రలో నయనతార లుక్స్, బాడీ లాంగ్వేజ్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. నయనతార సినిమాలన్నీ తెలుగులోనూ విడుదలవుతుంటాయి. ఆ రకంగా ఈ సినిమా కూడా త్వరలోనే తెలుగులో విడుదలయ్యే అవకాశాలు లేకపోలేవు.
మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న రాశీఖన్నా ఇటీవలే తెలుగులో 'తొలిప్రేమ' సినిమాతో సక్సెస్ అందుకుని, యంగ్ హీరో నితిన్‌తో 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలో నటిస్తోంది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.