ఇప్పుడు రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా ప్రమోషన్ కి, బిగ్ బాస్ హౌస్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ లో భాగంగా పలువురు హీరో, హీరోయిన్స్ బిగ్ బాస్ హౌస్ లో కొంత సమయం గడిపి, తమ సినిమాలకి కావలసినంత పబ్లిసిటీ చేసుకున్నారు. ఇప్పుడు అదే బాటలో ఎన్టీఆర్ కూడా నడవబోతున్నాడు. ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్, తన కొత్త సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇద్దరు హీరోయిన్ల ని హౌస్ లోకి పంపుతున్నాడు.
జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ కి హీరోయిన్స్ గా నటించిన రాశి ఖన్నా, నివేతా థామస్ లు ఈరోజు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. బిగ్ బాస్ హౌస్ లో కొంత సమయం గడపటం ఎంతో సంతోషంగా ఉందంటూ రాశి ఖన్నా తన అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారి మూడు పాత్రల్లో నటిస్తుండగా, సర్థార్ గబ్బర్ సింగ్ ఫేమ్ బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.