'స్వింగ్‌ జరా..' తమన్నా డాన్స్‌ అదిరే!

మరిన్ని వార్తలు

మిల్కీ బ్యూటీ తమన్నా అందంలోనే కాదు, డాన్సుల్లో కూడా దిట్ట. ఈ తరం హీరోయిన్స్‌లో తమన్నాని మించిన డాన్సర్‌ లేదనే చెప్పాలి. అందుకే ఇండియన్‌ మైకేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా ప్రశంసలు కూడా దక్కించుకుంది తమన్నా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'జై లవకుశ' సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేస్తోంది. ఈ సాంగ్‌కి తమన్నా చేసిన డాన్స్‌ న భూతో న భవిష్యతి అనే రేంజ్‌లో ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించేస్తున్నారు. ఎన్టీఆర్‌ డాన్సుకి తిరుగే లేదు. అలాంటి ఎన్టీఆర్‌తోనూ పోటీ పడి, కాన్‌సన్‌ట్రేషన్‌ అంతా తనవైపే ఉండేలా చేసేసింది తమన్నా ఈ సాంగ్‌లో. తమన్నా నడుం తిప్పుతుంటే అబ్బో ఏం తిప్పుతోందిరా అనే వాళ్లే అంతా. గతంలోనూ తమన్నా పలు చిత్రాల్లో బొంగరంలా నడుం తిప్పే స్టెప్పుల్లో ఆడి పాడింది. కానీ వాటన్నింట్లోకెల్లా ఈ సాంగ్‌లో తమన్నా డాన్స్‌ సూపర్‌ స్పెషల్‌. లేటెస్టుగా ఈ సాంగ్‌ టీజర్‌ రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. ఈ సాంగ్‌ సినిమాకే స్పెషల్‌ అట్రాక్షన్‌ కానుంది. హాట్‌ హాట్‌గా సూపర్‌ స్టైలిష్‌గా ఉంది తమన్నా ఈ సాంగ్‌లో. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. ఎన్టీఆర్‌ త్రిపాత్రాభియం చేస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుండి వచ్చే ప్రతీ స్టిల్‌ సినిమాపై అంచనాల్ని పెంచుతూనే ఉంది. లేటెస్ట్‌గా వచ్చిన ఈ సాంగ్‌ ఆ అంచనాల్ని మరింత పెంచేసింది. ఈ నెల 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS