ఇంటర్నెట్ మరింతగా అందుబాటులోకి వచ్చిన తరవాత.. ప్రేక్షకులు బాగా ముదిరిపోయారు. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్ని చూసేసి, సినిమా పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు. ఎక్కడి నుంచైనా ఓ సీనో, షాటో స్ఫూర్తిగా తీసుకుని తీస్తే దానిపై ఈజీగా `కాపీ` అనే ముద్ర వేసేస్తున్నారు.
ఈరోజే `రాధేశ్యామ్` ఫస్ట్ లుక్ టైటిల్ విడుదలైంది. ప్రభాస్ - పూజాలను రొమాంటిక్ యాంగిల్ లో చూసిన అభిమానులు ఫస్ట్ లుక్ బాగుందని మురిసిపోతోంటే, ఇది కాపీ అంటూ ఇంకొందరు సాక్ష్యాల్ని వెదికి చూపించే పనిలో నిమగ్నమయ్యారు. కంచె సినిమాలోని వరుణ్‌తేజ్, ప్రగ్యాజైస్వాల్ పోస్టర్ ని చూపిస్తే.. ఈ రెండూ ఒకేలా ఉన్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. నిజానికి ఈ రెండు లుక్కులూ ఒకేలా ఉన్నాయి. కాపీ అనలేం గానీ, రొమాంటిక్‌లుక్స్ దాదాపుగా ఒకేలా ఉంటాయి. కానీ.. ఫ్యాన్స్ మాత్రం దీన్ని ఈజీగా తీసుకోవడం లేదు. దర్శకుడు కొత్తగా ట్రై చేయొచ్చు కదా..? అంటున్నారు. టైటిల్ కూడా హిందీ ప్రేక్షకుల్ని ఉద్దేశించి పెట్టిందే అని, తెలుగు టచ్ లేదని వాదిస్తున్నారు. ప్రభాస్ ఫేస్‌పూర్తిగా చూపించలేదంటూ ఇంకొంత మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ లుక్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిందనుకోవాలంతే.