ప్రభాస్ సినిమా `రాధే శ్యామ్` అప్ డేట్ల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మొహం వాచిపోయేలా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో యూవీ క్రియేషన్స్ పై గుర్రుగానే ఉన్నారు ఫ్యాన్స్. సంక్రాంతికి ఈసినిమాని విడుదల చేస్తామని చెప్పడం మినహా.. మరో అప్‌డేట్ రాలేదు. ప్రమోషన్లు ఎప్పటి నుంచి మొదలెడతారో కూడా తెలీదు. కనీసం ఈలోగా ఓ చిన్నటీజర్ వదిలినా ఫ్యాన్స్ కి సంతోషమే. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రాధేశ్యామ్ టీజర్ రాబోతోందని టాక్. అదే రోజు సలార్ కి సంబంధించిన అప్‌డేట్ కూడా వస్తుంది.
అయితే ఇప్పుడు... రాధేశ్యామ్ గురించిన ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే... ఈ సినిమా క్లైమాక్స్ చాలా భారీ ఎత్తున తీశార్ట. 15 నిమిషాలు పాటు సాగే ఈ క్లైమాక్స్ కోసం ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు పెట్టారని టాక్. బహుశా.. టాలీవుడ్ లోనే అత్యంత ఖరీదైన క్లైమాక్స్ ఇదే కావొచ్చు. యూరప్ బ్యాక్ గ్రౌండ్ లో జరిగే కథ ఇది. క్లైమాక్స్ కూడా అక్కడే ప్లాన్ చేశారు. ఈ క్లైమాక్స్‌ని రెండు సార్లు తీశార్ట. అందుకే ఈ స్థాయిలో ఖర్చయి ఉంటుందని అంటున్నారు. రాధేశ్యామ్ ఓ రొమాంటిక్ జర్నీ.యాక్షన్ ఘట్టాలకు అంతగా స్కోప్‌లేదు. ప్రభాస్ నుంచి అభిమానులు యాక్షన్‌సన్నివేశాలే ఆశిస్తారు కాబట్టి... క్లైమాక్స్ లో భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశార్ట. అందుకే... ఇంత ఖర్చయిందని టాక్.