వరుణ్ తేజ్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఈ యేడాది తన నుంచి 2 సినిమాలు రాబోతున్నాయి. అందులో `గని` ఒకటి. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే సినిమా ఇది. జులై 30న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం ఇది వరకే ప్రకటించింది. అయితే.. ఇప్పుడు `గని` రిలీజ్ డేట్ కి ప్రభాస్ గండి కొట్టబోతున్నాడు. విషయం ఏమిటంటే... ప్రభాస్ `రాధేశ్యామ్`ని సైతం జులై 30నే విడుదల చేయాలని భావిస్తున్నార్ట.
ప్రభాస్ స్టామినా వేరు. తనది పాన్ ఇండియా మార్కెట్. ప్రభాస్ సినిమా అంటే... మిగిలిన హీరోలంతా సైడ్ అయిపోవాల్సిందే. జులై 30నే ప్రభాస్ సినిమా వస్తే.. తప్పకుండా గని పక్కకు తప్పుకోవాల్సిందే. కాకపోతే.. టాలీవుడ్ లో ప్రస్తుతం రిలీజ్ డేట్ల రచ్చ జరుగుతోంది. ముందు ఓ సినిమా ప్రకటిస్తే.. ఆ రోజున మరో సినిమా ఎనౌన్స్ చేయడం కుదరని పని. ప్రొడ్యూసర్ గిల్డ్ ఈ విషయంలో చాలా పేచీలే పెడుతోంది. మరి రాధే శ్యామ్ వెర్సస్.. గని విషయంలో ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.