టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే... పూజా హెగ్డే పేరే చెబుతారు. ఇప్పుడు హిందీ నుంచి కూడా పూజాకు ఆఫర్లు వస్తున్నాయి. కాకపోతే.. తను ఊపిరి సలపనంత బిజీ. తాజాగా పూజా మరో సినిమాలోనూ బుక్ అయ్యిందని సమాచారం. నాగచైతన్య - విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా `థ్యాంక్యూ`. ఈ చిత్రంలో కథానాయికగా పూజాని ఎంచుకున్నారని తెలుస్తోంది. నిజానికి ఈ పాత్ర కోసం ముందు సమంత పేరు పరిశీలించారు.
కానీ.. సమంత కాల్షీట్లు సర్దుబాటు కాకపోవడంతో.. పూజాని తీసుకొచ్చారు. అందుకోసం పూజాకి భారీ పారితోషికం కూడా అందివ్వబోతున్నారని టాక్. చైతూ - పూజా కాంబో ఇదేం కొత్త కాదు. `ఒక లైలా కోసం`లో పూజా హెగ్డేనే కథానాయిక. ప్రస్తుతం అఖిల్ తో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`లోనూ తనే కథానాయికగా నటిస్తోంది. మొత్తానికి అక్కినేని బ్రదర్స్‌కి లక్కీ హీరోయిన్ అయిపోయేట్టు వుంది.