రాధికా ఆప్టే.. సమాంత చిత్రాలతో పేరు తెచ్చుకున్న నటి. కథ, అందులోని తన పాత్ర నచ్చితే ఎంత బోల్డ్‌గా అయినా సరే, నటించేస్తుంది. తెలుగులో లెజెండ్, రక్త చరిత్రలాంటి సినిమాల్లో కనిపించింది. రాధికకు మెల్లగా నటన నుంచి... దర్శకత్వంపై ప్రేమ పెరుగుతున్నట్టుంది. త్వరలోనే మెగాఫోన్ పట్టుకుంటానంటోంది. అందుకోసం నటనకు గుడ్ బై చెబుతానంటోంది. ఇటీవల `ది స్లీప్ వాకర్స్` అనే ఓ షార్ట్ ఫిల్మ్ తీసింది. త్వరలోనే దాన్ని సోషల్ మీడియాలో విడుదల చేయబోతోంది.
'నాకు దర్శకత్వం అంటే ఇష్టం. త్వరలోనే మెగాఫోన్ పడతా. నటన, దర్శకత్వం రెండింటిపై ఒకేసారి దృష్టి పెట్టడం కష్టం. అందుకే నటనకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నా. ఓ రెస్టారెంట్ కూడా నిర్వహించాలని ఉంది. దర్శకత్వం, వ్యాపారం.. రెండింటిలో దేన్ని ఎంచుకున్నా.. నటిగా మాత్రం కొనసాగలేను. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలతో నా నటనకు వచ్చిన గుర్తింపు చాలు'' అంటోంది.