విరహ వేదనతో విలవిల్లాడిపోతున్నట్టుంది కదూ.. డస్కీ బ్యూటీ రాధికా ఆప్టేని ఈ పోజులో చూస్తోంటే.! తెలుగులో ఈ బ్యూటీ 'రక్తచరిత్ర', 'లెజెండ్' తదితర సినిమాల్లో నటించిన సంగతి తెల్సిందే. బాలకృష్ణతోనే రెండు సినిమాలు చేసిన రాధికా ఆప్టేకి, సౌత్ సినిమాలంటే ఒకింత చిన్న చూపు ఎక్కువే. రజనీకాంత్‌తో సినిమా చేశాక కూడా ఆ చిన్న చూపు పోలేదు. ఆ సంగతి పక్కన పెడితే, కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ మహిళలే కాదు, పురుషులూ ఈ జాడ్యానికి కారణమని పలు సందర్భాల్లో చెప్పింది రాధికా ఆప్టే. అందాల ప్రదర్శన విషయంలోనూ ఈ బ్యూటీకి ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. నటిగా, ఎలాంటి పాత్రలైనా చేయడానికి తాను సిద్ధమనీ, పాత్ర కోసం ఎలా కన్పించడానికైనా వెనుకాడనని రాధిక ఆప్టే చెబుతుంటుంది. అందుకే 'పర్‌ఛేద్' సినిమా కోసం న్యూడ్‌గా కూడా నటించేసింది రాధికా ఆప్టే. సో, ఈ తరహా సెక్సీ పోజులు రాధికా ఆప్టేకి పెద్ద కష్టమేమీ కాదు. చూసుకున్నోళ్ళకి చూసుకున్నంత గ్లామర్.. అంటూ డస్కీ బ్యూటీ ఇలా 'మేగ్జిమ్' కోసం మేగ్జిమమ్ అందాల్ని ఆరబోసేసింది. అదీ అత్యంత కళాత్మకంగా కావడమే విశేషం ఇక్కడ.