'తూనీగ' కుర్రాడు అదరగొట్టేస్తాడా.?

మరిన్ని వార్తలు

'తూనీగ తూనీగ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సుమంత్‌ అశ్విన్‌, పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. యంగ్‌ హీరోల రేసులో సుమంత్‌ అశ్విన్‌ది స్పెషల్‌ రూట్‌. ఎక్కువగా భావోద్వేగభరితమైన సినిమాల్ని ఎంచుకుంటుంటాడు సుమంత్‌. అలా ఎంచుకున్న సినిమాల్లో కొన్ని బోల్తా కొట్టినాసరే.. ఆ తరహా సినిమాల్ని వదులుకోవడంలేదు. 

చూడగానే ఎట్రాక్ట్‌ చేసే రూపం, దానికి తోడు మంచి స్టయిలింగ్‌.. ఇవే కాదు, బోల్డంత సెన్సాఫ్‌ హ్యూమర్‌, కామెడీ టైమింగ్‌, నటనా ప్రతిభ.. అన్నీ వున్నాయ్‌ సుమంత్‌ అశ్విన్‌లో. ఈ యంగ్‌ హీరో ఇప్పుడు 'ప్రేమ కథా చిత్రమ్‌ -2'లో నటిస్తున్నాడు. గతంలో సుధీర్‌బాబు హీరోగా నటించిన 'ప్రేమ కథా చిత్రమ్‌' అప్పట్లో సంచలన విజయాన్ని అందుకున్న విషయం విదితమే. ఆ బాటలోనే 'ప్రేమ కథా చిత్రమ్‌ -2' కూడా థ్రిల్లింగ్‌ ఎంటర్‌టైనర్‌లా రూపొందుతోందట. 

ఈ సినిమాలో 'జంబలకిడి పంబ' ఫేం సిద్ది ఇద్నాని హీరోయిన్‌గా నటిస్తోంది. మరో హీరోయిన్‌గా నందిత శ్వేత నటిస్తోంది ఈ సినిమాలో. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాలో దెయ్యం పాత్రలో రెచ్చిపోయి నటించేసింది నందిత శ్వేత. ఆమె పాత్ర ఆ చిత్రానికి ఎంత పెద్ద ప్లస్‌ అయ్యిందో అందరికీ తెలుసు. 'ప్రేమ కథా చిత్రమ్‌' సినిమాకి సంబంధించి కొన్ని స్టిల్స్‌ విడుదలయ్యాయి. 

వీటిల్లో సుమంత్‌ అశ్విన్‌ స్టైలింగ్‌ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సినిమాతో సుమంత్‌ అశ్విన్‌కి మంచి కమర్షియల్‌ హిట్‌ దక్కుతుందని చిత్ర దర్శక నిర్మాతలు అంటున్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS