రాధికా ఆప్టే, సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.. అందులో ఆమె మొహానికి మాస్క్ వేసుకుని కన్పించింది. ఇకనేం, అసలే కరోనా టెన్షన్‌తో ప్రపంచమంతా వణుకుతోందాయె. దాంతో, ఆమెకు కరోనా సోకిందేమోనన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. రకరకాల పుకార్లు కూడా షురూ అయ్యాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన రాధికా ఆప్టే, తన ఫొటో గురించి వివరణ ఇచ్చింది. తానేమీ కరోనాతో బాధపడటంలేదనీ, కరోనా లక్షణాలు కూడా తనకు లేవనీ, తాను వేరే ‘అవసరం’ కోసం హాస్పిటల్‌కి వెళ్ళాననీ, ఈ క్రమంలో మాస్క్ ధరించాల్సి వచ్చిందనీ రాధికా ఆప్టే వివరణ ఇచ్చింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరోపక్క, రాధికా ఆప్టే పబ్లిసిటీ స్టంట్ చేసిందంటూ ఆమెపై ట్రోలింగ్ చాలా జోరుగా షురూ అయిపోయింది. అయినా రాధికా ఆప్టేకి పబ్లిసిటీ స్టంట్లు కొత్తేమీ కాదు. పబ్లిసిటీ కోసం బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇవ్వడం, బోల్డ్‌గా నటించడం రాధికా ఆప్టేకి అలవాటే. తెలుగులో బాలకృష్ణ సరసన రెండు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. సౌత్‌లో ఓ అగ్ర హీరోపై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది. అలా నిత్యం వివాదాల్ని కోరుకునే రాధికా ఆప్టే, కరోనా వైరస్‌ని కూడా పబ్లిసిటీ కోసం వాడేసుకుందా? అంటే, కాదని ఎలా అనగలం? ఓ పక్క సెలబ్రిటీలు, కరోనా వైరస్ పట్ల ప్రజల్ని అప్రమత్తం చేస్తూ, అవేర్‌నెస్ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తోంటే, రాధికా ఆప్టే మాత్రం పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందని అనుకోవాలేమో.