కరోనా హాలీడేస్‌ని అందాల భామలు కొంత కష్టమైనా పర్వాలేదు ఓ మోస్తరు ఎంజాయ్ చేస్తున్నారు. తాము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో చెబుతూ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండని వాళ్లు కూడా ముందుకొచ్చి ఫ్యాన్స్‌తో మమేకమవుతున్నారు. అయితే, ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ తన ఫిట్‌నెస్‌ని ఎలా కాపాడుకుంటోందో తెలియ చెబుతూ కొన్ని వర్కవుట్ ఫోటోస్ పోస్ట్ చేసి, ఇంటి పట్టున ఉన్న తన ఫ్యాన్స్‌కి బూస్టప్ ఇచ్చింది.
చూస్తున్నారుగా ఈ ఫీట్. ఇలా చేస్తే, కాస్త టైమ్ పాస్ అవుతుంది. దాంతో పాటు, ఫిట్‌నెస్ కూడా తోడవుతుంది. ఇంట్లోనే ఉండి ఇలాంటి వర్కవుట్స్ చేసుకోమని సూచిస్తూ, శాంపిల్‌గా ఈ ఫోటో పోస్ట్ చేసింది. ఎప్పుడూ శృతిమించిన హాట్‌నెస్‌తో ఫోటోలకు పోజిచ్చే శ్రద్దా గత ఫోటోస్‌తో పోల్చితే ఈ ఫోటోలో కాస్త గ్లామర్ తగ్గినా, కళాపోషకులకు ఇందులోనూ ఆ కళ పుష్కలంగా కనిపించేలానే ఉంది. మరి, హాట్ బ్యూటీ ఇంత హాట్‌గా చెప్పినప్పుడు ట్రై చేయాలి కదా. చేయండి.. మీ వల్ల అయితే ట్రై చేయండి. లేదంటే, మీకు వచ్చిన, మీరు మెచ్చిన వర్కవుట్స్ చేయండి. కానీ, చేయండి.