బిగ్ బాస్‌లో వింత పరిణామం చోటు చేసుకుంది. తొలిసారి నామినేషన్స్ లిస్ట్‌లో రాహుల్ లేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. హౌస్‌లో చీమ చచ్చిపోయినా ఆ మర్డర్‌కి కారణం రాహులే అని ఆరోపించే శ్రీముఖి తొలిసారిగా రాహుల్‌ని నామినేట్ చేయకుండా వదిలేసింది. ఒకరిద్దరు రాహుల్‌ని నామినేట్ చేసినా, మెజార్టీ ఓట్లు రాకపోవడంతో, ఈ సారి రాహుల్ నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు.
ఇది రాహుల్‌కే నమ్మలేని నిజం. ఇక ఆయన ఫ్యాన్స్‌ని మరీ ఆశ్చర్యంలోకి నెట్టేస్తోంది. శ్రీముఖి, రాహుల్‌ని నామినేట్ చేయకుండా ఎందుకు వదిలేసింది.? కారణమేంటీ.? అంటే, ఎలాగూ రాహుల్‌ని మిగిలిన కంటెస్టెంట్లు నామినేట్ చేస్తారనుకుందో ఏమో, లేకుంటే, రాహుల్‌ని మాత్రమే టార్గెట్ చేస్తోంది శ్రీముఖి.. అనే ట్యాగ్ నుండి తప్పించుకోవాలనుకుందో ఏమో తెలీదు కానీ, ఈ సారి రాహుల్‌ని వదిలేసింది.
అలా 50 రోజుల బిగ్‌బాస్ షోలో తొలిసారి నామినేషన్స్ నుండి రాహుల్ తప్పించుకున్నాడు. కానీ, ఈ సారి రాహుల్ మాత్రం శ్రీముఖిని నామినేట్ చేశాడు. రాహుల్ లేకుండా, శ్రీముఖి నామినేషన్స్‌లో ఉంది ఈ సారి. ఇక ఈ వారం నామినేషన్స్ లిస్టులో మహేష్, శ్రీముఖి, పునర్నవి, హిమజ, శిల్పా చక్రవర్తి చేరారు. యునానిమస్‌గా హౌస్‌లో చాలా మంది శిల్పా చక్రవర్తిని నామినేట్ చేసేయడం మరో ఇంట్రెస్టింగ్ న్యూస్.