తొలి చిత్రంతోనే హిట్ అందుకుని ఒక మంచి టాలెంట్ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ కి ఆ తరువాత కాలంలో హీరోగా కాలం అంతగా కలిసి రాలేదు అనే చెప్పాలి. దీనితో మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రంలో ఒక చిన్న పాత్రను సైతం చేశాడు. ఇక హీరోగా చేస్తూనే తన చిరకాల కోరిక అయిన దర్శకత్వం వైపుకి దృష్టి మరల్చాడు.
అందులో భాగంగానే తొలి చిత్రాన్ని సుశాంత్ హీరోగా చి.ల.సౌ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు, ఆ చిత్రం ఈ నేలాఖరిలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇదే సమయంలో ఆయన దర్శకత్వం చేయబోయే రెండవ చిత్రానికి సంబందించిన వార్త కూడా బయటికి వచ్చేసింది.
ఆ చిత్రానికి సంబంధించి కథ, తారాగణం వివరాలు తెలియనప్పటికి ఆ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ ముందుకి వచ్చింది, ఈ విషయాన్నీ స్వయంగా రాహుల్ తన సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు.
మరి ఈ అవకాశాన్ని రాహుల్ రవీంద్రన్ ఎలా సద్వినియోగం చేసుకుంటాడు అనేది వేచి చూడాలి.