సన్నీలియోన్‌ బయోపిక్‌ అంత పచ్చిగా ఉంటుందా?

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ స్టార్‌ సన్నీలియోన్‌ బయోపిక్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సన్నీలియోన్‌ అసలు పేరు 'కరణ్‌జీత్‌కౌర్‌'ని ఈ సినిమాకి టైటిల్‌గా పెట్టడం జరిగింది. విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్‌ని లేటెస్టుగా రిలీజ్‌ చేశారు. 

ట్రైలర్‌లో చాలా బోల్డ్‌ అంశాలున్నాయి. సన్నీలియోన్‌ చిన్నతనం నుండీ, తాను మోడల్‌గా మారడం వరకూ ట్రైలర్‌లో చూపించారు. ఓ పక్క మోడల్‌గా కనిపించాలన్న తపన, మరోవైపు ఇంట్లో తల్లితండ్రుల నుండి చీవాట్లు వీటితో పాటు కొన్ని బోల్డ్‌ సన్నివేశాలను ట్రైలర్‌లో చూపించారు. అయితే ఇంతకీ ఇది సినిమా కాదు. వెబ్‌ సిరీస్‌. ఓ వెబ్‌ ఛానెల్‌లో విడుదలవుతోంది. 

సినిమా అంటే సెన్సార్‌ కష్టాలుంటాయి. వెబ్‌ సిరీస్‌కి కదా. సెన్సార్‌ సమస్యలుండవు. అందుకనే 'కరణ్‌జీత్‌ కౌర్‌'ను చాలా హాట్‌గా చూపించబోతున్నారట. సినిమాలో చాలా న్యూడ్‌ సీన్స్‌ ఉంటాయట. సన్నీలియోన్‌ పోర్న్‌ స్టార్‌గా ఎలా మారింది. పోర్న్‌ రంగంఈ నుండి బాలీవుడ్‌కి రావడానికి ఎన్ని ఇబ్బందులు పడింది.. ఇవన్నీ ఈ వెబ్‌ సిరీస్‌లో చూపించనున్నారట. ముఖ్యంగా సన్నీ పోర్న్‌ కెరీర్‌ గురించి డీటెయిల్డ్‌గా చూపించనున్నారనీ తెలుస్తోంది. అంటే సినిమా చాలా పచ్చిగా ఉండబోతోందన్నమాట. 

సన్నీలియోన్‌ చిన్నప్పటి పాత్రలో రైసా సజౌనీ అనే బాలిక నటిస్తోంది. జూలై నుండి ఈ వెబ్‌ సిరీస్‌ అందుబాటులోకి రానుందనీ తెలుస్తోంది. ఆదిత్యాదత్‌ ఈ వెబ్‌ సిరీస్‌కి దర్శకత్వం వహించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS