బిగ్‌ ట్విస్ట్‌: రాహుల్‌ ఎట్‌ 'సీక్రెట్‌' రూమ్‌

మరిన్ని వార్తలు

ఈ వారం రెండు ఎలిమినేషన్లు ఉంటాయని చెప్పి, రాహుల్‌ సిప్లిగంజ్‌ని ఎలిమినేట్‌ చేసేసి, ఎలిమినేషన్‌ తర్వాత జరిగే ప్రక్రియను యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా కంప్లీట్‌ చేసేసి, తూచ్‌! ఇది ఫేక్‌ ఎలిమినేషన్‌ అని బిగ్‌బాస్‌ వీక్షకులకు బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చారు ఈ వారం హోస్ట్‌ నాగార్జున. అయితే, ఈ ఫేక్‌ ఎలిమినేషన్‌ అనంతరం మరి రాహుల్‌ ఏం చేస్తున్నాడు? అంటూ ఓ సీక్రెట్‌ లోన్‌లీ రూమ్‌లో రాహుల్‌ని పెట్టినట్లు చూపించారు.

 

బిగ్‌బాస్‌ నుండి తదుపరి ఆదేశం వచ్చేంత వరకూ అక్కడే వెయిట్‌ చేయమని రాహుల్‌కి చెప్పాడు. పాపం రాహుల్‌ ఒక్కడే ఆ సీక్రెట్‌ రూమ్‌లో వెయిట్‌ చేస్తున్నాడు. అలా హౌస్‌ మేట్స్‌ నుండి ఒక రోజు దూరంగా ఉన్న రాహుల్‌ సిప్లిగంజ్‌ ఈ రోజు మళ్లీ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దాంతో హౌస్‌లో నవ్వులు పూస్తున్నాయి. రాహుల్‌ ఎలిమినేషన్‌తో హౌస్‌లో పెద్దగా బాధపడిన వారెవ్వరూ లేరు. కానీ, బాగా ఎమోషనల్‌ అటాచ్‌మెంట్‌ ఉన్న వరుణ్‌ సందేశ్‌.. సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ కెమిస్ట్రీ కనెక్షన్‌ ఉన్న పునర్నవి చాలా ఎమోషన్‌ అయ్యారు.

 

ఇంతవరకూ ఎప్పుడూ ఏడవని వరుణ్‌ సందేశ్‌ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. ఇక పునర్నవి పరిస్థితి అయితే, మాటల్లో చెప్పలేనిది. తన కారణంగానే రాహుల్‌ ఎలిమినేట్‌ అయిపోయాడనే గిల్టీ ఫీలింగ్‌ ఓ పక్క, తన బెస్ట్‌ ఫ్రెండ్‌ మోర్‌ దేన్‌ ఫ్రెండ్‌ హౌస్‌లో లేడనే బాధ ఇంకోపక్క ఆమెని తీవ్ర మనోవేదనకు గురి చేశాయి. ఏదేమైతేనేం, రాహుల్‌ ఎలిమినేట్‌ కాలేదు. మళ్లీ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సో వరుణ్‌, పునర్నవి ఆనందానికి అంతే ఉండదిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS