బిగ్ బాస్ 3 విజేతగా నిలిచాడు రాహుల్ సిప్లిగంజ్. ఫైనల్‌లో శ్రీముఖి రాహుల్‌కి గట్టి పోటీ ఇచ్చింది. నిజానికి రాహుల్ పై ఎవ్వరికీ నమ్మకాలు లేవు. బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్‌లలో ఒకరు గెలుస్తారనుకున్నారంతా. కానీ అనూహ్యంగా రాహుల్ విన్నర్ గా నిలిచాడు. ఇంత పోటీ తట్టుకుని, అండర్ డాగ్‌గా అడుగుపెట్టి టైటిల్ గెలవడం మామూలు విషయం కాదు. కాకపోతే గెలిచానా రాహుల్ కి ఓ విషయంలో సంతృప్తి లేదు. అదే.. పారితోషికంలో. బిగ్ బాస్ విన్నర్‌గా 50 లక్షలు గెలుచుకున్నాడు రాహుల్. అందులో కొంత మొత్తం టాక్స్ రూపంలో పోతుంది.
గెలిచినా, గెలవకపోయినా ప్రతీ కంటెస్టెంట్‌కూ వారానికి ఇంత అంటూ ముట్టజెబుతుంటారు. చివరి వరకూ రాహుల్ ఉన్నాడు కాబట్టి మంచి మొత్తంలోనే డబ్బులు అంది ఉంటాయనుకున్నారంతా.కానీ.. బిగ్ బాస్ హౌస్‌లో అన్ని రోజులు ఉన్నందుకు రాహుల్‌కి అదనంగా 20 లక్షలు కూడా రాలేదని తెలుస్తోంది. మరోవైపు రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి మాత్రం రాహుల్ కంటే ఎక్కువే తన బ్యాగులో వేసుకుని వెళ్లింది. బాబా భాస్కర్, వరుణ్ సందేశ్‌లకు సైతం మంచి మొత్తాలు అందాయట. ఈ విషయంలో తక్కువ జీతం తీసుకున్నది రాహులే. అందుకే ఆ అసంతృప్తి.