రాహుల్‌ - పునర్నవి మధ్య ఏం జరిగింది?

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌లో డే వన్‌ నుండీ రాహుల్‌ - పునర్నవి జంట హైలైట్‌ అవుతూ వస్తోంది. కానీ, సడెన్‌గా బిగ్‌బాస్‌లో స్ట్రేటజీ మారిపోయింది. ఏదో జరుగుతోంది ఈ జంట మధ్యలో.. అనే ఇంట్రెస్ట్‌తో క్యూరియాసిటీగా వీక్షిస్తున్న ఆడియన్స్‌కి సస్పెన్స్‌ వీడిపోయేలా చేసి, షోపై ఉన్న ఇంట్రెస్ట్‌ తగ్గించేశారు. ఇంతవరకూ లవ్‌లీ అండ్‌ క్యూట్‌గా కనిపించిన ఈ జంట మధ్య ఇప్పుడు శత్రుత్వం రాజ్యమేలుతోంది. పునర్నవి, రాహుల్‌ని డీల్‌ చేసే విధానం, రాహుల్‌ పునర్నవిని ట్రీట్‌ చేస్తున్న విధానం విస్తుగొలుపుతోంది.

 

అసలేం జరుగుతోంది వీరి మధ్య.. స్నేహమా.? ప్రేమా.? శత్రుత్వమా.? అనే అయోమయ పరిస్థితిలో ఉన్నారు వీక్షకులు. కెప్టెన్సీ టాస్క్‌లో రాహుల్‌ పార్టిసిపేట్‌ చేస్తానని అనగా, పునర్నవి రాహుల్‌ని వెనక్కి లాగేసింది. ఈ విషయమై వరుణ్‌, వితికలతో సీరియస్‌గా డిస్కస్‌ చేస్తున్న పునర్నవి.. మధ్యలో వచ్చిన రాహుల్‌ని గమనించలేదు. దాంతో తన గురించే డిస్కషన్‌ జరుగుతోందని గ్రహించిన రాహుల్‌, పునర్నవితో గొడవకు దిగాడు.

 

కోపగించిన పునర్నవి, టాస్క్‌ల్లో పార్టిసిపేట్‌ చేసినా ఏం పీకుతావ్‌.. అన్నట్లుగా డీ మోటివేట్‌ చేసేలా మాట్లాడడం రాహుల్‌ని బాధపెట్టింది. ఆ తర్వాత కాసేపటికి పునర్నవి, రాహుల్‌కి టీ తీసుకొని వచ్చి, మామూలుగానే మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ, రాహుల్‌ మాత్రం ప్లీజ్‌ నన్ను ఒంటరిగా వదిలెయ్‌ అంటూ.. మరోసారి పునర్నవిపై చిర్రెత్తాడు. అసలింతకీ రాహుల్‌, పునర్నవి మధ్య ఈ మిస్‌ అండర్‌స్టేండింగ్‌ ప్రాబ్లెమ్‌ ఎందుకొచ్చిందో అర్ధం కావడం లేదు జనానికి. ఇక హౌస్‌లో వీరిద్దరినీ మేనేజ్‌ చేయడం వరుణ్‌, వితికలకు కత్తి మీద సామే అవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS