రాహుల్‌కి షాకిచ్చిన వరుణ్‌!

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ సీజన్‌ 3కి సంబంధించి ఫ్రెండ్‌షిప్‌ అంటే రాహుల్‌, వరుణ్‌దే అన్నట్లుగా ఇన్నాళ్లూ కొనసాగింది. రాహుల్‌ని ఫేక్‌ ఎలిమినేషన్‌ చేస్తే వరుణ్‌ కంట తడి పెట్టాడు. నిజానికి వరుణ్‌ ఎక్కువగా ఫీలవ్వాల్సినంత పని లేదు. అతని రిలేషన్‌ భార్య అయిన వితిక తనతో పాటే ఉంది. సో తనకు అత్యంత సన్నిహితుడిగా భావించిన రాహుల్‌ హౌస్‌ నుండి వెళ్లిపోతే అంతగా ఫీలవ్వాల్సిన అవసరం లేదు. కానీ, వరుణ్‌ చాలా జెన్యూన్‌గా కంట తడి పెట్టిన దృశ్యం చూశాం.

 

అయితే, తాజా ఎపిసోడ్‌లో రాహుల్‌తో వరుణ్‌ ఫిజికల్‌గా తలబడడం, హద్దులు మీరి మాట్లాడడం వీక్షకులతో పాటు, రాహుల్‌నీ షాక్‌కి గురి చేసింది. అసలే మిస్టర్‌ కూల్‌గా పేరుంది వరుణ్‌ సందేశ్‌కి. అలాంటిది అనవసరంగా రాహుల్‌పై ఎందుకంత యాగీ చేశాడో అర్ధం కావడం లేదు. అప్పుడెప్పుడో జరిగిన హిమజ ఇష్యూని లేవదీశాడు. నీ ఆటిట్యూడ్‌ అంతే, నీ బిహేవియర్‌ అందరికీ తెలిసిందే.

 

నువ్వెలాంటి వాడివో అందరూ చూస్తున్నారులే.. అంటూ రాహుల్‌తో ఫిజికల్‌గా, మెంటల్‌గా గొడవకు దిగాడు. ఈ ఎపిసోడ్‌ చూస్తుంటే, తాజాగా బిగ్‌బాస్‌ సీజన్‌ స్టార్టింగ్‌లో మహేష్‌పై వరుణ్‌ ఎలా రీజన్‌లెస్‌గా గొడవకు దిగాడో, అదే సిట్యువేషన్‌ కళ్ల ముందు తలపించింది. నిజంగానే వరుణ్‌, రాహుల్‌తో గొడవ పడ్డాడా.? లేక ఇదంతా టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌ వేసిన స్కెచ్‌నా.? అనేది తెలియాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS