తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపి స్వరాష్ట్ర కలని సాకారం చేసి అదే రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన కేసిఆర్ జీవితం పై ఒక చిత్రం రూపొందనున్న సంగతి అందరికి విదితమే.
అయితే ఆయన పాత్రని ఎవరు పోషిస్తారు అనే విషయమై తీవ్ర చర్చలు జరిగాయి. ఇప్పుడు ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. కేసిఆర్ పాత్ర కోసం ప్రముఖ హిందీ నటుడు రాజ్ కుమార్ రావు ని ఎంపిక చేసుకునట్టు నిర్మాత తెలిపారు.
ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ అయిందట. త్వరలోనే షూటింగ్ ప్రారంబించి వచ్చే సంవత్సరం తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత-దర్శకుడు మధుర శ్రీధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.