విజయ్‌ దేవరకొండ గురించి రాజ్‌తరుణ్‌ ఏమన్నాడంటే.!

By iQlikMovies - December 06, 2018 - 18:42 PM IST

మరిన్ని వార్తలు

ఒక్కో టైంలో ఒక్కో హీరో క్రేజ్‌ సంపాదించుకుంటూంటాడు. అలా ఒకప్పుడు 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో అనుకోకుండా హీరో అయిపోయి కెరీర్‌ తొలినాళ్లనోనే హాట్రిక్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అసలు సిసలు తెలుగు కుర్రోడు రాజ్‌తరుణ్‌. ఇప్పుడీ కుర్రోడి హవా ఏమంత లేదు కానీ, తన తర్వాతి చిత్రంతో మాత్రం ఓ సర్‌ప్రైజ్‌ ఇస్తానంటున్నాడీ యంగ్‌ హీరో. 'అంధగాడు' వంటి సినిమాతో మనోడు ప్రయోగాలు కూడా చేసేశాడు. అయితే ఈ సారి ఏం కొత్త ప్రయోగం చేసి సర్‌ప్రైజ్‌ ఇస్తాడో తెలీదు కానీ, ఈ మధ్య వరుస పరాజయాలతో కాస్త దూకుడు తగ్గించాడు.

ఆచి తూచి కథలను ఎంచుకుంటున్నాడట. ప్రస్తుతం రెండు మూడు కథలు చర్చల దశలో ఉన్నాయట. త్వరలోనే కన్‌ఫామ్‌ చేసి చెబుతానంటున్నాడు. ఎనర్జీ, చిలిపితనం అంటే చటుక్కున గుర్తొచ్చే కుర్రోడు రాజ్‌తరుణ్‌. హీరో అంటే అందంగానే ఉండాలా.? అనుకునే వారు అవాక్కయ్యేలా చేశాడు తన స్లిమ్‌ పర్సనాలిటీతో రాజ్‌తరుణ్‌. డైరెక్షన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ నుండి వచ్చి అనుకోకుండా హీరో అయిపోయి, ఇక ఇందులోనే సెటిలైపోయాడు. అయితే ఎప్పటికైనా డైరెక్షన్‌ చేయాలన్న తన కోరిక మాత్రం చంపుకోలేదంటున్నాడు.

ఇక ఈ తరం హీరోల విషయానికి వస్తే, విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాడు. ఆయన్ని చూస్తే యంగ్‌ హీరోలందరికీ జలస్‌ ఉండడం సహజమే. కానీ మనోడు మాత్రం విజయ్‌ దేవరకొండ విషయంలో అభిప్రాయమేంటని అడిగితే కొంచెం తెలివిగా సమాధానమిచ్చాడు. విజయ్‌ దేవరకొండ ఇప్పుడున్న హీరోల్లో ది బెస్ట్‌ అని బెస్ట్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చి తప్పించేసుకున్నాడు

https://twitter.com/itsRajTarun/status/1070532041072988162


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS