టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ వివాదం రోజుకొక మలుపు తిరుగుతోంది. మొదట లావణ్య పోలీసులకి కంప్లైంట్ చేసింది, తరవాత రాజ్ తరుణ్, మాల్వీ కూడా లావణ్యకి వ్యతిరేఖంగా పోలీసులకి పిర్యాదు చేసారు. రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే కేసు ఫైల్ చేశారు. రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేసు ఫైల్ చేసి, నోటీసులు ఇష్యు చేయనున్నారు. లావణ్య, కేవలం ఆరోపణలు చేయకుండా స్ట్రాంగ్ ఆధారాలని పోలీసులకి అందించినట్లు సమాచారం. లావణ్య తరుపున హైకోర్టు లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర కేసు తీసుకున్నారు. లావణ్యకి న్యాయం జరిగే వరకు పోరాడుతామని దిలీప్ సుంకర మీడియాకి తెలియజేశారు.
దిలీప్ సుంకర ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ 'రాజ్ తరుణ్ లావణ్యని గోవాకి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని, ఆమె మెళ్ళో ఉన్న నల్లపూసల దండ ఇందుకు సాక్ష్యం అని, 2017 నుంచి లావణ్యతో తనకి ఎలాంటి శారీరక సంబంధం లేదని చెప్పిన రాజ్ తరుణ్ 2017లోనే లావణ్యకి రెండు సార్లు అబార్షన్ చేయించాడని, ఈ గర్భానికి కారణం ఎవరు. ఆమెకి అబార్షన్ ఎలా జరిగిందో రాజ్ తరుణ్ చెప్పాలని దిలీప్ డిమాండ్ చేశారు. అంతే కాదు రాజ్ తరుణ్ లావణ్య కి డైవర్స్ కావాలని మెసేజ్ లు చేస్తూ, డబ్బులు, ఇల్లు, స్థలం ఆఫర్ చేసాడని, మరి పెళ్లి కానప్పుడు డైవర్స్ మాట ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తున్నాడు.
ఒక వేళ లావణ్య డ్రగ్స్ కి అలవాటు పడితే ఆ తప్పు రాజ్ తరుణ్ దే అని, అతని సంరక్షణలో ఉన్న అమ్మాయి డ్రగ్స్ కి అలవాటు పడితే ఆమెని రీహాబిలిటేషన్ కి పంపించి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాజ్ తరుణ్ దే అన్నారు. మాల్వీ మల్హోత్రాతో ఉన్న ఎఫైర్ ని డైవర్ట్ చేయటానికే మస్తాన్ సాయిని తెరపైకి తెచ్చాడని దిలీప్ ఆరోపిస్తున్నాడు. కచ్చితంగా తమ దగ్గర ఉన్న ఆధారాలతో లావణ్యకి హైకోర్టులో న్యాయం జరుగుతుందని, రాజ్ తరుణ్ తప్పైపోయిందని చెప్పి ఆమెని భార్యగా స్వీకరించాల్సిందే తప్ప మరో మార్గం లేదని అన్నారు దిలీప్.