'నా ప్రేమ విశ్వమంత..' అంటున్న రాజ్‌తరుణ్‌

మరిన్ని వార్తలు

రాజ్‌తరుణ్‌ కొత్త చిత్రం 'లవర్‌' టీజర్‌ విడుదలైంది. టీజర్‌ చాలా బాగుంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం టీజర్‌ తాజాగా విడుదలైంది. రాజ్‌తరుణ్‌ పిలకతో సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు. హీరోయిన్‌గా రిథీ కుమార్‌ ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తోంది. అభిరుచి గల నిర్మాత దిల్‌రాజు రూపొందిస్తున్న చిత్రమిది. దిల్‌ రాజు చెయ్యేస్తే, అది ఖచ్చితంగా హిట్‌ సినిమా లెక్కే. కథలో విషయం ఉంటే కానీ దిల్‌రాజు ముందుకు రాడు.

సో దాంతోనే సినిమాపై అంచనాలు క్రియేట్‌ అయిపోయాయి. అనీష్‌ కృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక టీజర్‌లో రాజ్‌తరుణ్‌ చెబుతున్న డైలాగులు చాలా క్యాచీగా యూత్‌ని ఎట్రాక్ట్‌ చేసే విధంగా ఉన్నాయి. సినిమాని రిచ్‌గా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది టీజర్‌ చూస్తుంటే. 'నా ప్రేమ విశ్వమంత. నువ్వు తప్పించుకోలేవ్‌..' అని చీటీలో చూసి గాల్లో ఎగురుతూ రాజ్‌తరుణ్‌ చెబుతున్న డైలాగ్‌. కొంచెం ఓవర్‌ అయినట్లుందిరా అని బ్యాక్‌ గ్రౌండ్‌లో రాజ్‌తరుణ్‌ ఫ్రెండ్‌ చెబుతున్న డైలాగ్‌.

అస్సలు ఓవర్‌ కాదు.. 'అంటూ ఓ లవర్‌గా రాజ్‌తరుణ్‌ కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ చూస్తుంటే ఈ సినిమాతో రాజ్‌తరుణ్‌ బౌన్స్‌ బ్యాక్‌ అయ్యేలానే అనిపిస్తున్నాడు. ఇటీవల 'రాజుగాడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రాజ్‌తరుణ్‌ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఈ సినిమాతో సక్సెస్‌ అందుకునేలానే ఉన్నాడు చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS