జబర్‌దస్త్ కామెడీ షోలో, హైపర్ ఆది టీమ్ మెంబర్ అయిన దొరబాబుని అంత తేలిగ్గా మర్చిపోలేం. ఎందుకంటే, అతనికి వేరే టైపు ఫాలోయింగ్ ఎక్కువ. ఆ ఫాలోయింగ్ గురించి హైపర్ ఆది పదే పదే తన స్కిట్స్‌లో ప్రస్తావిస్తుంటాడు. జబర్‌దస్త్‌కి ముందు దొరబాబు, కొన్ని షార్ట్ ఫిలింస్‌లో నటించాడు. అవిప్పటికీ యూ ట్యూబ్‌లో ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అన్నట్టు, ఆ షార్ట్ ఫిలింస్ బీ-గ్రేడ్ సెక్సువల్ కంటెంట్‌తో వున్నవేనని అందరికీ తెల్సిందే. ఆ దొరబాబు ఇప్పుడు కొత్తగా వార్తల్లోకెక్కాడు. విషయమేంటంటే, ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేస్తే, ఆ దాడిలో దొరబాబు పోలీసులకు చిక్కాడు.
హైపర్ ఆది టీమ్ కే చెందిన మరో టీమ్ మెంబర్ పరదేశి కూడా పోలీసులకు రెయిడింగ్‌లో దొరికినట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలోని ఓ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతున్నట్లు పక్కాగా పోలీసులకు సమాచారం అందడంతో, సదరు ఇంటిపై పోలీసులు రెయిడ్స్ నిర్వహించారు. వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోన్న నిర్వాహకుల్ని, విటుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కొంత నగదుని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారట. జబర్‌దస్త్ స్కిట్స్‌తోనే కాదు, ఈ తరహా కార్యకలాపాలతోనూ దొరబాబు ‘ఇమేజ్’ ఆ టైపులో మార్మోగిపోనుందన్నమాట. అయినా, జబర్‌దస్త్ కామెడీతో బోల్డంత ఫాలోయింగ్ వచ్చాక.. ఇలాంటి దిక్కుమాలిన పనులేంటి.? అంటూ జబర్‌దస్త్ ఫాలోవర్స్, దొరబాబు తీరుపై మండిపడుతున్నారు.