ఫ్లాప్ హీరోతో చైతూ సినిమా?

By Gowthami - May 06, 2020 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

నాగ చైత‌న్య‌కి ఎప్ప‌టి నుంచో.. సొంత బ్యాన‌ర్ స్థాపించాల‌ని ఆశ‌. అన్న‌పూర్ణ స్డూడియోస్ లో ఏ సినిమా తీసినా, చైతూ నిర్మాణ బాధ్య‌త‌లు చూసుకుంటుంటాడు. ఆ అనుభ‌వం త‌న‌కు ఉంది. పైగా స‌మంత కూడా తోడైంది. ఇద్ద‌రికీ... సొంత సినిమా తీయాల‌ని ఎప్ప‌టి నుంచో ఉంది. అది... ఇప్పుడు కార్య‌రూపం దాలుస్తోంది. రాజ్ త‌రుణ్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు చైతూ. క‌థ ఇప్ప‌టికే సిద్ధమైంది. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గాక‌, లాక్ డౌన్ ఎత్తేశాక షూటింగ్ మొద‌లెడ‌దామ‌ని అనుకుంటున్నాడు. అవికా గోర్‌ని క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన `ఉయ్యాల జంపాల‌` అన్న‌పూర్ణ స్టూడియోస్ లో తెర‌కెక్కించిన సినిమానే.

 

ఇప్పుడు దానికి సీక్వెల్ .. చైతూ బ్యాన‌ర్‌లో వ‌స్తోంద‌న్న‌మాట‌. చైతూ అనుకుంటే.. ఏ హీరోతో అయినా సినిమా చేయ‌గ‌ల‌డు. కానీ.. ఫ్లాపుల‌లో ఉన్న రాజ్ త‌రుణ్ ని ఎంచుకున్నాడు. అంటే క‌థ రాజ్ త‌రుణ్‌ని బాగా డిమాండ్ చేసింద‌న్న‌మాట‌. రాజ్ త‌రుణ్ హీరోగా `ఒరేయ్ బుజ్జిగా` తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకి మంచి బ‌జ్ ఏర్ప‌డింది. అందుకే.. ముందు జాగ్ర‌త్త‌గా రాజ్ త‌రుణ్‌ని బుక్ చేశాడ‌న్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS