ప్రముఖ నటుడు శివాజీ రాజా గుండెపోటు కి గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని స్టార్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. హాస్య నటుడిగా, కామెడీ విలన్ గా ప్రసిద్ధి చెందిన నటుడు శివాజీ రాజా. ఒకట్రెండు సినిమాల్లో హీరోగానూ నటించారు. ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ కి ఆప్త మిత్రుడు. `మా` అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల కరోనా వల్ల బాధపడుతున్న సినీ కుటుంబాలకు తన వంతు సహాయం అందించారు. ఇంతలోనే గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరారు.
గురువారం ఆపరేషన్ చేస్తామని వైద్యులు తెలిపారు. బీ.పి డౌన్ అవ్వడం వల్ల.. హార్ట్ ఎటాక్ వచ్చింది. ప్రస్తుతం బాగానే వున్నారు.శివాజీరాజా త్వరగా కోలుకోవాలని ఆయన సన్నిహితులు,కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.