'అమ్మ బ్లాక్ షర్ట్ వద్దంటే బ్లాక్ కూడా కలరే కదా నా ఇష్టం అంటాడు. కానీ లవర్ బ్లాక్ షర్ట్ వేసుకోవద్దంటే ఠకీమని మానేస్తాడు. అమ్మ గుడికి రమ్మంటే ఇష్టపడడు. కానీ లవర్ గుడికి రమ్మంటే వచ్చేస్తాడు..' ఇవన్నీ చేసేది ఎవరనుకుంటున్నారా? యంగ్ హీరో రాజ్‌తరుణ్. ఆయన తాజా చిత్రం 'రంగుల రాట్నం' సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.
ఈ ట్రైలర్‌లో హీరో క్యారెక్టరైజేషన్‌ని ట్రైలర్ ద్వారా ఇలా చూపించాడు డైరెక్టర్. లవ్‌లో ఇలాంటివన్నీ రెగ్యులరే కానీ, ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. రాజ్‌తరుణ్ సరసన చిత్రశుక్లా హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటి సితార రాజ్‌తరుణ్‌కి తల్లి పాత్రలో కనిపిస్తోంది. కమెడియన్ ప్రియదర్శన్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. టార్చర్ పెట్టినా కానీ ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకునే కుర్రాడి పాత్రలో నటిస్తున్నాడు రాజ్‌తరుణ్ ఈ సినిమాలో.
అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్‌లో తెరకెక్కుతోంది ఈ సినిమా. అప్పుడు రాజ్‌తరుణ్ హీరోగా 'ఉయ్యాలా జంపాలా' సినిమా ఇదే బ్యానర్‌లో రూపొందింది. మంచి విజయం అందుకుంది. మరోసారి రాజ్‌తరుణ్ హీరోగా సేమ్ బ్యానర్ నుండి వస్తోన్న సినిమా 'రంగుల రాట్నం'. ఈ సినిమాని సంక్రాంతి బరిలో ఉంచారు. ఆల్రెడీ సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాల మధ్యన ఈ సినిమాని దించారంటేనే సినిమాలో కంటెన్ట్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధమైంది. ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి.
సంక్రాంతి సీజన్‌లో సరదా సరదా ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు ఎన్ని వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. అలా ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. చూడాలి మరి, 'రంగుల రాట్నం' సినిమాతో రాజ్‌తరుణ్ సంక్రాంతికి ఏ రేంజ్ వసూళ్లు కొల్లగొడతాడో!