'లవర్‌' బోయ్‌ రాజ్‌ తరుణ్‌.. కిర్రాక్‌ లుక్‌

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ ఇటీవల 'రాజుగాడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా అంతగా అతనికి విజయాన్నివ్వలేదు. ఈ ఏడాది ఇప్పటికే రెండు పరాజయాల్ని చవిచూసేశాడు ఈ యంగ్‌ హీరో. సంక్రాంతికి వచ్చిన 'రంగులరాట్నం' సినిమా రిజల్ట్‌ అందరికీ గుర్తుండే వుంటుంది. ఈ నేపథ్యంలో సక్సెస్‌ల రాజుగా సినీ పరిశ్రమలో పేరొందిన దిల్‌ రాజు చేతిలో పడ్డాడు రాజ్‌ తరుణ్‌. 

దిల్‌ రాజు నిర్మిస్తోన్న 'లవర్‌' సినిమాలో నటిస్తున్నాడు రాజ్‌ తరుణ్‌. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. ఇప్పటిదాకా రాజ్‌ తరుణ్‌ ఏ సినిమాలోనూ కన్పించని డిఫరెంట్‌ లుక్‌తో ఈ సినిమా కోసం కనిపిస్తున్నాడు. నెత్తిన స్టైలిష్‌ పిలకతో రాజ్‌ తరుణ్‌ లుక్‌ సూపర్బ్‌గా వుందనే రిపోర్ట్స్‌ వస్తున్నాయి. రిధి కుమార్‌ ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదొక ఇంట్రెస్టింగ్‌ లవ్‌ స్టోరీ అట. లవ్‌ స్టోరీస్‌ - దిల్‌ రాజు బ్యానర్‌ అంటే ఆ కిక్కే వేరప్పా. అనీష్‌ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 

తన కెరీర్‌లోనే ఇదొక డిఫరెంట్‌ మూవీ అవుతుందనీ, దిల్‌ రాజు లాంటి మనసున్న నిర్మాతతో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాననీ రాజ్‌ తరుణ్‌ అంటున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మోడ్రన్‌ లవర్‌ బాయ్‌లా రాజ్‌ తరుణ్‌ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో వేచి చూడాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS