నా నువ్వే మొదటి రోజు కలెక్షన్లు తెలిస్తే షాక్ అవుతారు

మరిన్ని వార్తలు

తన కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా లవర్ బాయ్ పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్ కి ఆ ప్రయత్నం బెడిసికొట్టింది అనే చెప్పాలి. ఎందుకంటే నిన్న విడుదలైన నా నువ్వే చిత్రం మొదటిరోజు కలెక్షన్స్ ఒకసారి చూస్తే మనకి అర్ధమవుతుంది.

మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ 89 లక్షలు మాత్రమే రాబట్టగలిగింది. అసలు అతని కెరీర్ లోనే ఇంత తక్కువగా మొదటిరోజు వసూలు చేసిన చిత్రంగా ఇది మిగిలిపోనుంది. ఇక అమెరికాలో సైతం ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ శాతం కూడా చాలా తక్కువట. దీనితో ఈ చిత్రం ఫ్లాప్ జాబితాలోకి చేరినట్టే అని ట్రేడ్ వర్గాలు ఒక అంచనాకి వచ్చేస్తున్నాయి.

ఏదేమైనా ఒక ప్రయోగం చేసిన కళ్యాణ్ రామ్ కి దాని ఫలితం మాత్రం అంతగా కలిసిరాలేదు అనే చెప్పాలి. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన తమన్నా నటించగా ప్రముఖ యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వం వహించారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS