ఆస్కార్ అకాడమీలో రమా - రాజమౌళి

మరిన్ని వార్తలు

టాలీవుడ్ కి ఆస్కార్ ని పరిచయం చేసింది రాజమౌళి. RRR సినిమాలో నాటు నాటు పాట ప్రాంచవ్యాప్తంగా గుర్తింపు తేవటమే కాకుండా, ఆస్కార్ కూడా దక్కించుకుంది. ఇండియన్ సినిమాకి కలగా మిగిలిన ఆస్కార్ ని టాలీవుడ్ ముంగిట నిలిపారు జక్కన్న. ఆస్కార్ కలని నెరవేర్చిన దర్శకధీరుడు మళ్ళీ ఆస్కార్ వేదిక పై మెరవనున్నారు. "అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్" రాజమౌళికి ఆహ్వానం పంపింది. ఈ ఏడాది 487 మంది కొత్త సభ్యులకు ఆహ్వానాలు అందజేయగా ఇందులో భారతీయ ప్రముఖులైన ఎస్ఎస్‌ రాజమౌళి, ఆయ‌న భార్య‌ ర‌మా రాజ‌మౌళి, షబానా అజ్మీ, రితేష్ సిధ్వానీ, సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వి వ‌ర్మ‌న్‌, ఫిల్మ్‌మేక‌ర్ రిమా దాస్‌, నాటు నాటు సాంగ్ కొరియోగ్రాఫ‌ర్ ప్రేమ్ ర‌క్షిత్ కూడా ఉన్నారు. 


ఆస్కార్ అకాడ‌మీ ఆహ్వానం అందుకున్న వారిలో 71 మంది ఆస్కార్ నామినీలు, మ‌రో 19 మంది ఆస్కార్ విజేత‌లు కూడా ఉన్నారు. మొత్తం వీరితో కలిపి స‌భ్యుల సంఖ్య 10, 910కి చేరుతుంది. ఇందులో సుమారు 9 వేల మంది ఆస్కార్ వేడుక‌ల స‌మ‌యంలో ఓటు వేయడానికి అర్హులు. ఈ సంద‌ర్భంగా అకాడ‌మీ సీఈఓ బిల్ క్రామిర్‌, అధ్య‌క్షుడు జానెత్ యాంగ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. "ఈ సంవత్సరం అకాడమీకి కొత్త సభ్యులను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ప్ర‌పంచ‌దేశాల‌కు చెందిన అసాధారణ ప్రతిభావంతులైన కళాకారులు, నిపుణులు మా చిత్రనిర్మాణ రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపారు. అలాంటి వారిని ఆహ్వానించ‌డం ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు. 


ఆస్కార్ అకాడమీలో సభ్యులకి ఆస్కార్ సినిమాలకు ఓటు వేసే హక్కు వస్తుంది. స్పెషల్ స్క్రీనింగ్స్, పలు వర్క్ షాప్స్, సెమినార్లుకి వెళ్లొచ్చు. అకాడమీకి చెందిన ఈవెంట్స్ కి అటెండ్ అవొచ్చు. అకాడమీ లైబ్రరీకి కూడా యాక్సెస్ ఉంటుంది. ఈ మెంబర్స్ నుంచి సినిమాలకి సంబంధించి సలహాలు, సూచనలు తీసుకుంటారు . ఇలాంటి గొప్ప అవకాశాన్ని పొందిన రాజమౌళి, అతని భార్య రమా రాజమౌళికి టాలీవుడ్ సినీప్రముఖులు కంగ్రాట్స్ చెప్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS