ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెలుగు సినిమా 'బాహుబలి'. ఇప్పుడు సెకండ్ పార్ట్‌కి సిద్ధమైంది. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఈ మధ్యే పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా పబ్లిసిటీకి అన్నీ రంగం సిద్ధం చేస్తున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఇందులో భాగంగా ఓ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన. ఆ ఇంటర్వ్యూకి యాంకర్‌గా వచ్చిన సుమని 'బాహుబలి' సెట్లోకి ఆహ్వానించారు. ఇంతవరకూ ఈ సినిమా సెట్లోకి చిత్ర యూనిట్ తప్ప ఇక ఎవ్వర్నీ రానివ్వలేదు. అలాంటిది తొలిసారిగా సుమ ఎంటరైంది. ఈ వీడియో క్లిప్పింగ్స్ చూస్తుంటేనే చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా ఏదో వింత లోకంలోకి వెళ్తున్నట్లే ఉంది. సినిమా సెట్ అంటే పూర్తిగా సెట్ వేయాల్సిన అవసరం ఉండదు. వెయ్యరు కూడా. ఎందుకంటే బ్లూ మ్యాట్ మీదే చాలా వరకూ షూటింగ్ కానిచ్చేస్తూ ఉంటారు. కానీ 'బాహుబలి' సినిమా కోసం రాజమౌళి అలా చేయలేదు. ప్రతీది సెట్లో చూపించాడు. నిజంగా మాహిష్మతి సామ్రాజ్యాన్ని నిర్మించేశారు ఆయన. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఈ ఇంటర్వ్యూ స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇకపై ఈ సినిమా పబ్లిసిటీకి ఇంకెన్ని స్పెషల్స్‌ని ఫాలో చేస్తాడో రాజమౌళి చూడాలి. ప్రబాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.