కరోనా కారణంగా లాక్‌డౌన్ మూడ్‌ని సెబ్రిటీలు విశేషంగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ‘అర్జున్‌రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇంటి పనిలో భాగంగా ఇళ్లు ఊడ్చి, క్లీనింగ్ చేసి, గిన్నెలు తోమారు. అంతటితో ఆగలేదాయన. ఆ ఆ ఛాలెంజ్‌ని రాజమౌళికి విసిరారు. జక్కన్న రాజమౌళి ఏం తక్కువా.. ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచం దృష్టినే ఆకర్షించిన గొప్ప దర్శకుడాయన. అలాంటిది ఇంటి పని చక్కబెట్టలేరా.? చెప్పండి. అందుకే ఆ ఛాలెంజ్‌ని స్పోర్టివ్‌గా స్వీకరించారు. ఆయన కూడా ఇళ్లు ఊడ్చడంతో పాటు , ఇంటి కిటికీ అద్దాలు క్లీన్ చేయడం, గిన్నెలు తోమడం తదితర పనుల ద్వారా ఛాలెంజ్ పూర్తి చేసేశారు. ఆయన కూడా అక్కడితో ఆగలేదండోయ్. చరణ్‌కీ, ఎన్టీఆర్‌కీ, కీరవాణికీ, ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డకీ ఈ ఛాలెంజ్ విసిరారు. ఇప్పటికే చరణ్ వంట చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Challenge accepted Jakkana @ssrajamouli 👍🏻 https://t.co/6QRo16XVIK
— Jr NTR (@tarak9999) April 20, 2020
ఇక ఇప్పుడు రాజమౌళి ఛాలెంజ్‌ని ఎలా యాక్‌సెప్ట్ చేస్తారో చూడాలి మరి. మొత్తానికి కరోనా కాలం భలే పని చేసిందిలే. ఒకింత కష్టాన్నీ, మరింత వినోదాన్నీ పంచుతోంది. ఏది ఏమైనా స్టే హోమ్, స్టే సేఫ్ అనే నినాదాన్ని ప్రజలకు గట్టిగా వినిపించేందుకు సెబ్రిటీలు చేస్తున్న ప్రచారంలో భాగమే ఇదంతా. తాము ఇంట్లోనే ఉంటూ ఈ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కాలక్షేపం చేస్తూ, ఉన్నంతలో తమ వంతుగా అభిమానులకు వినోదం పంచుతూ కరోనా కట్టడికి తోడ్పడుతున్నారు.