'ఆచార్య' సినిమా మొదలవ్వడానికి వెనుక దర్శకుడు రాజమౌళి ఉన్నారట. రాజమౌళి హెల్ప్ తోనే ఆచార్య సెట్స్ కి వెళ్ళిందట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. ‘‘‘ఆర్‌ఆర్‌ఆర్’ ఒప్పుకొన్న తర్వాత కొరటాల శివతో చరణ్ ఒక సినిమా చేయాలనుకున్నారు. కానీ సినిమా పూర్తయ్యే వరకూ రాజమౌళి ఆయన నటులను బయటకు పంపరు. దీంతో ఒక రోజు శివను మా ఇంటికి పిలిచా. ‘చరణ్‌తో కాకుండా నాతో ఒక సినిమా చేయొచ్చు కదా’ అని అడిగా. ఆయన వెంటనే ఒప్పుకొన్నారు. అయితే నా కోసం కథ సిద్ధం చేసిన తర్వాత ఒక పాత్ర చరణ్ చేయాల్సి రావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.
ఇదే విషయాన్ని రాజమౌళికి చెప్పడానికి ప్రయత్నిస్తే కుదరలేదు. చివరికి సురేఖ సెంటిమెంట్‌ను ఉపయోగించి ‘ఆచార్య’లో చరణ్ నటించేలా రాజమౌళిని ఒప్పించాం. అలా పరోక్షంగా ఈ సినిమాలో రాజమౌళి భాగస్వామి అయ్యారు. అందుకే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన విచ్చేశారు'' అని చెప్పుకొచ్చారు మెగాస్టార్.