బాహుబలి చిత్రంతో ప్రపంచాన్ని మన దేశం వైపు తిప్పిన అద్బుత డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు బాహుబలేతర విషయంలో వార్తల్లోకి ఎక్కారు.
తెలుస్తున్న వివరాల ప్రకారం, రాజమౌళి ఈ మధ్యనే ఒక ఖరీదైన కారుని కొనుగోలు చేసారు. BMW 7 సిరీస్ మోడల్ అయిన ఈ కారు విలువ సుమారు రూ 1 కోటి రూపాయలు అని తెలుస్తుంది. అయితే ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా, రాజమౌళి కుటుంబం ఒక సాధారణ జీవితం గడపడానికే మొగ్గు చూపుతారనే టాక్ బయట ఉన్న పరిస్థితుల్లో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
మొత్తానికి ఖరీదైన కార్లు ఉన్న సెలబ్రిటీల జాబితాలోకి రాజమౌళి చేరిపోయారు.