రాజమౌళి 'మహాభారతం' అప్పుడే కాదు

మరిన్ని వార్తలు

రాజమౌళికి 'మహాభారతం' సినిమాని తెరకెక్కించాలన్నది ఓ కల. ఈ సినిమాకి కథ రెడీ చేయడానికి తండ్రి విజయేంద్రప్రసాద్‌ రెడీగా ఉన్నారు కూడా. రాజమౌళి అడగడమే ఆలస్యం అంటున్నారు ఆయన. 'బాహుబలి'తో ఆయనకి దక్కిన గుర్తింపుతో ఆ స్థాయిలో ఆయన తెరకెక్కించే సినిమా ఇదేనంటూ అంతా ఎదురు చూస్తున్నారు. అదే ఆయన తదుపరి సినిమా అంటూ, ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే రాజమౌళి మాత్రం అందుకు టైం ఉందనీ, ఇప్పుడప్పుడే కాదనీ అంటున్నారు. 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చిన ఘనుడు రాజమౌళి. తీస్తే, గీస్తే రాజమౌళి మాత్రమే అత్యద్భుతమైన ఆ మహా భారత గాధని తెరకెక్కించగల సత్తా ఉన్నోడు. 'బాహుబలి' చిత్రం కోసం తన సర్వ శక్తులూ ఆర్జించాడు దాదాపు ఐదేళ్లుగా రాజమౌళి. దాంతో ఇప్పుడప్పుడే అంతటి భారీ స్థాయి సినిమాను తెరకెక్కించే యోచనలో రాజమౌళి లేరని విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. ప్రస్తుతం ఆయన 'బాహుబలి' విజయాన్ని ఆస్వాదించే మూడ్‌లోనే ఉన్నారు. మహాభారతం సినిమా అత్యంత భారీ బడ్జెట్‌ మూవీ అవుతుంది. అందుకోసం కాస్టింగ్‌ కూడా భారీగానే యోచించాలి. సో ఈ ఘట్టానికి సమయం ఇంకా రాలేదనే అనిపిస్తోంది రాజమౌళి వ్యాఖ్యలతో. అయితే ప్రస్తుతం రాజమౌళి నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ఏంటనేది మాత్రం తెలియాలంటే మరికొంత సమయం ఆగక తప్పదేమో!.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS