తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచిన దర్శకుడు రాజమౌళి. అలాంటి దర్శకుడుకి ఒక సినిమా ట్రైలర్ తెగనచ్చింది.
ఇంతకి ఆ సినిమా ఏంటంటే- నాని తాజా చిత్రం నిన్ను కోరి. ఈ ట్రైలర్ నిన్న ఉదయం రిలీజ్ అయిన సమయం నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఈ ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే చూసిన దర్శకుడు రాజమౌళి బాగా ఎక్సైట్మెంట్ కి గురయ్యాడు.
వెంటనే ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవ్వకుండా చూస్తాను అని ట్వీట్ చేశాడు. దీనితో ఈ సినిమాకి ఒక్కసారిగా బూస్ట్ వచ్చిందనే చెప్పాలి.
ఈ కామెంట్ కి వెంటనే నాని రిప్లై ఇస్తూ- సార్ మీరు ఇచ్చినఈ కామెంట్ తో సినిమా సగం హిట్ అయినట్టే అంటూ ట్వీట్ చేశాడు.