ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం `ఆర్.ఆర్.ఆర్`. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా రూ.800 కోట్ల బిజినెస్ జరుపుకుందని ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి. సినిమా బడ్జెట్ మాత్రం రూ.400 కోట్ల లోపే. అంటే ఎటు చూసినా రూపాయికి రెండు రూపాయలు వస్తుందన్నమాట.
అయితే ఈసినిమాకి సంబంధించి ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి పారితోషికాలు తీసుకోలేదని టాక్. సినిమాలో వాళ్లకూ భాగం ఉందని తెలుస్తోంది. రాజమౌళి ఎప్పుడూ పారితోషికం బదులుగా సినిమాలో వాటానే తీసుకుంటాడు. ఈ సినిమాకీ అంతే. అనధికార లెక్కల ప్రకారం చూస్తే.. దేశంలోనే అత్యధిక పారితోషికాన్ని అందుకునే దర్శకుడికింద లెక్క. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కూడా అదే బాట పట్టారని తెలుస్తోంది. దాంతో ఈ ఇద్దరు హీరోలకూ ఇది వరకు రానంత పారితోషికం ఈ సినిమాతో అందబోతోందని సమాచారం. ఇప్పటికే బిజినెస్ సగం పూర్తయిపోవడంతో నిర్మాత దానయ్య కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇదే ఉత్సాహంతో హైదరాబాద్‌లో ఓ కొత్త ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లోని అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో దానయ్య ఖరీదైన ఓ ఇల్లు నిర్మించుకుంటున్నారు.