గుడ్ న్యూస్: స‌మంత త‌ల్లి కాబోతోందా?

By Gowthami - February 16, 2020 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

స‌మంత ఎప్పుడు ఎదురైనా - త‌ల్లి ఎప్పుడు అవుతారు? అనే పశ్నే ఎదుర‌య్యేది. స‌మంత కూడా `అందుకు టైమ్ ఉంది` అన్న‌ట్టే ముసి ముసిగా న‌వ్వుతూ స‌మాధానం చెప్పేది. ఇప్పుడు ఆ స‌మ‌యం వ‌చ్చేసింది. అవును.. స‌మంత త‌ల్లి కాబోతోంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే అక్కినేని కుటుంబం నుంచి మ‌రో వార‌సుడు రాబోతున్నాడ‌ని గుస‌గులు వినిపిస్తున్నాయి.

 

ఇటీవ‌లే `జానూ`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దీని త‌ర‌వాత స‌మంత కొత్త‌గా సినిమాలేవీ ఒప్పుకోలేదు. ఎవ‌రైనా కొత్త క‌థ‌తో వెళ్తే... `కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాల‌ని అనిపిస్తోంది` అంటోంద‌ట‌. దీనంత‌టికీ కార‌ణం.. స‌మంత మ‌న‌సు పిల్ల‌ల‌పై మ‌ళ్లింద‌ని, త‌ల్లి కావాల‌ని ఆరాట‌ప‌డుతోందని, అందుకు సంబంధించిన ప్లానింగ్ మొద‌లైంద‌ని తెలుస్తోంది. నాగ‌చైత‌న్య తో పాటు అక్కినేని కుటుంబంఅంతా స‌మంత త‌ల్లి కావాల‌ని ఆశ ప‌డుతోంది. అందుకే స‌మంత ఈ స్టెప్ తీసుకుంద‌ని స‌మాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS