రాజమౌళి-ప్రభాస్ కలయికలో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రాలు- బాహుబలి 1 & 2. ఈ సినిమాతో వీరివురి మార్కెట్ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది.
ఇలాంటి తరుణంలో ఈ ఇద్దరు మళ్ళీ కలిసి పనిచేస్తే ఆ సినిమా ఎలా ఉండబోతుంది అది ఎంత బిజినెస్ చేస్తుంది అన్న వార్తలకే సినీ ట్రేడ్ మార్కెట్ ఊగిపోతుంది. అదే ప్రశ్న రాజమౌళి ని అడగగా- తాము దాదాపు అయుదు సంవత్సరాల పాటు కలిసి పనిచేశాం అని అందుకే ఇక వెంటనే ప్రభాస్ తో కలిసి పని చేసే అవకాశం లేదు అని తెలిపాడు.
ప్రభాస్ ఇప్పటికే తన తదుపరి చిత్రం షూటింగ్ లో బిజీ అయిపోగా రాజమౌళి కూడా తాను చేయబోయే మెగా మల్టీ స్టారర్ (ఎన్టీఆర్-రామ్ చరణ్) ప్రీ-ప్రొడక్షన్ పనులలో తలమునకలై ఉన్నాడు. ఇక వీరు ఇద్దరు కలిసి పనిచేయాలి అని అంటే దాదాపుగా ఇంకొక 3 ఏళ్ళ తరవాతే అని అనుకోవచ్చు.
‘బాహుబలి’ కలయిక చూడాలంటే ఆమాత్రం నిరీక్షించక తప్పదు మరి.